విద్యతోనే జీవితంలో ఉన్నత స్థాయి

విద్యతోనే జీవితంలో ఉన్నత స్థాయి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజావాణి న్యూస్ నవంబర్ 11, 2026: విద్యతోనే వ్యక్తి జీవితంలో సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని, విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర సాధనతో తమ లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని లక్షెట్టిపేటలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాల వార్షిక క్రీడా దినోత్సవ కార్యక్రమానికి ఆర్.సి.ఓ. శ్రీధర్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...