వార్డు మెంబర్ల కుటుంబాలకే ఇందిరమ్మ ఇళ్లా? అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరిగిందంటూ ఖాతా గ్రామస్తుల ఆవేదన
నంగునూరు, నవంబర్ 11:సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఖాతా గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై వివాదం నెలకొంది. అర్హులైన నిరుపేద కుటుంబాలను పక్కనపెట్టి, గ్రామానికి చెందిన కొందరు వార్డు సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, అన్నదమ్ములకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారంటూ గ్రామస్థుడు కొలిపాక శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదలకు ఆశ్రయం కల్పించాలనే లక్ష్యంతో చేపట్టినప్పటికీ, ఖాతా గ్రామంలో ఆ...