prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 6:56 pm Digital Edition : PRAJA VANI

పల్లాటి జగన్ సంతాప సభను జయప్రదం చేయండి

**పల్లాటి జగన్ సంతాప సభను జయప్రదం చేయండి**

**ముఖ్య అతిథిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ హాజరు**

**TWJF నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఎర్ర లింగం పిలుపు**

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 11 (ప్రజావాణి):

**మంచాల:** నవతెలంగాణ మంచాల రిపోర్టర్, సీపీఎం మండల కమిటీ సభ్యుడు పల్లాటి జగన్ సంతాప సభను విజయవంతం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఎర్ర లింగం పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 13వ తేదీన మంచాల మండలం నోముల గ్రామంలో పల్లాటి జగన్ సంతాప సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై తన కలం ద్వారా గళమెత్తిన జగన్ మృతి జర్నలిజం రంగానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. ఆయనకు నివాళులర్పించేందుకు జర్నలిస్టులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై సంతాప సభను విజయవంతం చేయాలని ఎర్ర లింగం కోరారు.