నర్మెట్ట ప్రాథమిక పాఠశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం  – విద్యార్థులకు ఉపాధ్యాయుల సందేశం

నంగునూరు, నవంబర్ 11:భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, గొప్ప విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవాన్ని నంగునూరు మండలం నర్మెట్ట ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా దేశ విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. 1888...