prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 7:04 pm Digital Edition : PRAJA VANI

జయపురం పాఠశాలలో నూతన మూత్రశాలలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్

జయపురం పాఠశాలలో నూతన మూత్రశాలలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్

ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట నవంబర్ 11 : నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నూతన మూత్రశాలలను గ్రామ సర్పంచ్ నెలకుర్తి రేణుక అశోక్ రెడ్డి, ఎంఈఓ రాంమోహన్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య, ఉప సర్పంచ్ చుక్క వేణుతో కలిసి ఆమె ప్రారంభించారు
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో పాఠశాలలో నూతన మూత్రశాలలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి గ్రామ పంచాయతీ తరఫున ఎల్లవేళలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు మందుల రాంముర్తి, ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ టీచర్లు, గ్రామ నాయకులు అశోక్ రెడ్డి,ఐలయ్య విద్యార్థులు పాల్గొన్నారు.