జనగాం సంతోష్ కుమారుడికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆశీస్సులు
చిన్నమడూరులో ఘనంగా చిన్నారి జన్మదిన వేడుకలు, ఆశీర్వదించిన నాయకులు, కార్యకర్తలు
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 11 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, చిన్నమడూరు గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జనగాం సంతోష్ కుమార్ కుమారుడి జన్మదిన వేడుకలు బుధవారం గ్రామంలో ఘనంగా, సంతోషకర వాతావరణంలో జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు చిన్నారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో పెరిగి, చదువులో రాణించి, తల్లిదండ్రులకు, గ్రామానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, జనగాం సంతోష్ కుమార్ పార్టీ కోసం ఎంతో నిబద్ధతతో, అంకితభావంతో పనిచేశారని, గ్రామంలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలు తనకు సొంత కుటుంబంతో సమానమని, వారి సుఖ సంతోషాల్లో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. సంతోష్ కుమార్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
జన్మదిన వేడుకల్లో చిన్నారి కేక్ కట్ చేయగా, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు చప్పట్లతో, కేరింతలతో శుభాకాంక్షలు తెలిపారు. సంతోష్ కుమార్ దంపతులు విచ్చేసిన అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమారుడిని ఆశీర్వదించడానికి వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి, సర్పంచ్ మైదం జోగేశ్వర్, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు, కామారెడ్డి గూడెం సర్పంచ్ చింత రవి, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.