ఘనంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలు చిరస్మరణీయం – ప్రిన్సిపాల్ డాక్టర్ శామ్యూల్ డేవిడ్ రాజ్
పోరుమామిళ్ల: నవంబర్ 11ప్రజావాణి భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కళాశాలలోని రసాయన శాస్త్ర విభాగం మరియు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శామ్యూల్ డేవిడ్ రాజ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమాన్ని...