prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 1:34 pm Digital Edition : PRAJA VANI

గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో కీలకం – సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్

గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో కీలకం – సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్

బెజ్జంకి, నవంబర్ 11 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో ప్రజల భద్రతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలను ఘనంగా ప్రారంభించారు. సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పులి కృష్ణ,ఎస్సై తోట తిరుపతి, గ్రామ సర్పంచ్ ఎర్రల జానకిరాజు కలిసి కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇది ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.గ్రామ ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.సర్పంచ్ ఎర్రల జానకిరాజు మాట్లాడుతూ గ్రామంలో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణతో పాటు మహిళలు, పిల్లలు, వృద్ధులకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని,గ్రామంలోని ముఖ్య కూడళ్లు, పాఠశాలలు,దేవాలయాలు,ప్రధాన రహదారుల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చింతలపల్లి పద్మ, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.