కోతులనడుమ ప్రైమరీ స్కూల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ఘనంగా ప్రారంభం.
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలలో,కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రైమర్ స్కూల్ కోతుల నడుమ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా రోజువారి కూలి పనులకు వెళ్లవలసి ఉన్నందున తమ పిల్లలకు కొన్నిసార్లు కష్టంగా మారుతుంది అలాంటి పేద కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన పౌష్టికాహారం అందించడం ఎంత గొప్ప నిర్ణయం విద్యార్థుల ఆరోగ్యం విద్యాభివృద్ధి పేద కుటుంబాల పిల్లలకు ఈ కార్యక్రమం అమలు చేస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరియు హుస్నాబాద్ శాసనసభ్యులు రాష్ట్ర బీసీ సంక్షేమ,రవాణశాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి,తెలంగాణ ప్రభుత్వానికి కోతులనడుమ గ్రామం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ బాణత్ రాజ్, గ్రామ సర్పంచ్ మాట్ల లింగయ్య,ఉప సర్పంచ్ దుండ్ర శీను వార్డ్ మెంబర్లు ఎర్రోళ్ల చైతన్య కుమార్,పల్లె రాకేష్ గౌడ్,గ్రామశాఖ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ శ్రీపతి మొగిలి,పెద్దగొల్ల రాజు యాదవ్,ఎర్రోళ్ల రమేష్,తిరుపతి బకయ్య కాశరాజు రమేష్, మాట్ల చిరంజీవి,తాళ్లపల్లి హరీష్,మల్లికార్జున్,ఎర్రోళ్ల వేణు అజయ్ తదితరులు పాల్గొన్నారు.