prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 6:15 pm Digital Edition : PRAJA VANI

కమాన్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు సహకరించండి

కమాన్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు సహకరించండి

కూనారం జంక్షన్ వద్ద యూ టర్న్ తీసుకోవాలి

వాహనదారులకు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. శ్రీనివాస్ విజ్ఞప్తి

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి:నవంబర్ 11

పెద్దపల్లి పట్టణంలోని కమాన్ ప్రాంతంలో రోజురోజుకూ ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

పట్టణంలోని జెండా, సుభాష్‌నగర్ ప్రాంతాల నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనదారులు కమాన్ వద్ద నేరుగా వెళ్లకుండా ఎడమవైపు (లెఫ్ట్ సైడ్) తీసుకొని, కూనారం జంక్షన్ వద్ద యూ టర్న్ తీసుకుని కరీంనగర్ వైపు వెళ్లాలని సూచించారు.

కమాన్ ప్రాంతంలో వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో ట్రాఫిక్ నియంత్రణకు ఈ మార్గాన్ని అనుసరించడం ఎంతో అవసరమని తెలిపారు. వాహనదారులు సూచించిన మార్గంలో ప్రయాణించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడవచ్చని పేర్కొన్నారు.

ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్న పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. శ్రీనివాస్ కోరారు.