prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 8:11 am Digital Edition : PRAJA VANI

108 అంబులెన్స్ లో ప్రసవం…. తల్లి,బిడ్డ క్షేమం

108 అంబులెన్స్ లో ప్రసవం…. తల్లి,బిడ్డ క్షేమం

ఈ ఏం టి ప్రేమ్ కుమార్,పైలెట్ వీరేశంలను అభినందిస్తున్న మండల ప్రజలు

మద్దూరు నవంబర్12, ప్రజా వాణి,

దూల్మిట మండలం కూటిగల్ గ్రామానికి గర్భిణీ కత్తెరోజు భవానికి ఈ రోజు ఉదయం 3 గంటలకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు108కు సమాచారం అందించారు.ఈ సందర్భంగా అంబులెన్స్ లో ఆమెను హుస్నాబాద్. ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ ప్రేమ్ కుమార్,పైలెట్ వీరేశం చాకచక్యంగా ప్రసవం చేశారు. కత్తెరోజు భవాని ఆడబిడ్డకుజన్మనివ్వగా,ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారు.సమయానికి స్పందించిన 108 సిబ్బందిని కుటుంబీకులు,మండల ప్రజలు, ప్రజా ప్రతినిధులు అభినందిస్తున్నారు.