100 సార్లు రక్తదానం చేసిన ప్రాణదాత మల్లిగారి రాజన్న కు ఘన సత్కారం
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 05 (ప్రజావాణి):జనగామ పట్టణంలో 100 సార్లు రక్తదానం చేసి ఎందరికో ప్రాణదాతగా నిలిచిన మల్లిగారి రాజన్న ని గురువారం వారి నివాసంలో సావిత్రి బాయి ఫూలే ఫౌండేషన్ ఫౌండర్ యాసారపు కరుణాకర్ ఆధ్వర్యంలో
ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు, అడ్వకేట్ దడిగే సందీప్, అబ్దుల్ గఫ్ఫార్, అడ్వకేట్ కందగట్ల శ్రవణ్ కుమార్ తదితరులు శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రక్తదానం కంటే గొప్ప దానం లేదని, 100 సార్లు రక్తదానం చేయడం అంటే మామూలు విషయం కాదని కొనియాడారు. రాజు చేస్తున్న సేవ యువతకు ఆదర్శమని, ఆయన స్ఫూర్తితో యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడే బాధ్యత తీసుకోవాలని, రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకోవాలని సూచించారు. మల్లిగారి రాజన్న సేవా భావాన్ని అభినందిస్తూ, ఆయన ఆరోగ్యం, భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు.