prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 6:15 pm Digital Edition : PRAJA VANI

యూఏఈలో ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగ యువతకు టామ్‌కామ్ ఆహ్వానం

**యూఏఈలో ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగ యువతకు టామ్‌కామ్ ఆహ్వానం!***

హనుమకొండ జిల్లా నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

తెలంగాణ ప్రభుత్వ సంస్థ టామ్‌కామ్ (TOMCOM) ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్మాణ రంగంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

జనరల్ హెల్పర్స్‌కు నెలకు సుమారు రూ.27 వేలు, కార్పెంటర్స్, స్టీల్ ఫిక్సర్స్, మేసన్స్‌కు సుమారు రూ.34 వేల వేతనం అందించనున్నారు.

అభ్యర్థుల వయస్సు 22 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి. ఎంపికైన వారికి ఉచిత విమాన టికెట్, వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించనున్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు 08035524946 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని లేదా www.tomcom.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.