prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 5:24 pm Digital Edition : PRAJA VANI

పగలు ఓటిపిలు లాగిన్లు ఓసీలు ఉండవు..? అది అధికారులు ఉన్నప్పుడా..? <br>ఆ తర్వాత మరింత రెచ్చిపోతున్న అక్రమార్కులు…?

*పగలు ఓటిపిలు లాగిన్లు ఓసీలు ఉండవు..?

*అది అధికారులు ఉన్నప్పుడా

*ఆ తర్వాత మరింత రెచ్చిపోతున్న అక్రమార్కులు…?

*చింతకాని మండలం చిన్న మండవలో ప్రభుత్వ ఆదాయానికి గండి…!

ఒకటే అనుమతి కానీ… జిరాక్స్లతో కొనసాగుతున్న దందా..?

ఆన్లైన్ పేమెంట్లకు లేదు అనుమతి ఓన్లీ క్యాష్…?

*పత్రికలు గోషిస్తున్న చిత్తశుద్ధి లేని యంత్రాంగాలు…!

*కన్నెత్తి చూడని వైనం.. తనిఖీలు చర్యలు అంతకంటే ఉండవా…?

*పబ్లిక్ గా రవాణా అవుతున్న ఇసుక వెనుక కీలక సూత్రధారులు…?

*ఇంతకీ.. నిఘాను పటిష్టం చేసి తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటారా..!

*వదిలేస్తారా.. సమగ్ర చర్యలు తీసుకుంటారా..?

డిప్యూటేషన్ ఇన్చార్జిల పాలనలో దారి మల్లుతున్న ఇసుక..?

ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలో నిద్రావస్థలో యంత్రాంగాలు..?

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

తిమిరి ఇస్కంబున తైలంబూ తీయవచ్చు.. ఎటువంటి అనుమతులు లేకపోయినా కాసుల వర్షం కురుస్తుంది. సంబంధిత శాఖల అధికారులు నిద్రలో జోగుతున్న వ్యవహారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. దర్జాగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూఅందిన కాడికి ఆర్జించటానికి రాజమార్గంగా ఏర్పడటం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రతినిధి సేకరించిన సమాచారం మేరకు ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండవ మున్నేరు ఇసుక రీచ్ నుండి అక్రమార్కులు అర్ధరాత్రి పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అనే తేడా లేకుండా పబ్లిక్ గా ఇసుకను అక్రమ రవాణా చేస్తూ నిత్యం సుమారు రెండు లక్షల రూపాయలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు పలు పత్రికలు ప్రధానంగా మన ప్రజావాణి పత్రికలో ఆధారాలతో వార్తా కథనాలు గత కొన్ని రోజులుగా వెలువడుతున్నప్పటికీ సంబంధిత మైనింగ్ రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ ట్రాన్స్పోర్ట్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఖమ్మం జిల్లాలోని ముదిగొండ చింతకాని బోనకల్ మండలాలకు అక్రమార్కులు ఇసుకను తరలిస్తూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు గండి పెడుతున్నట్లు ఆరోపణలు విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా అక్కడ విధులు నిర్వహించే ఇన్చార్జి జిపిఓ వీఆర్ఐ గా చలామణి అవుతున్న ఓ ఉద్యోగి మరో గ్రామస్థాయి అధికారి సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటిదాకా ఆన్లైన్ పేమెంట్లు అక్రమంగా వసూలు చేసినట్లు ఆ తర్వాత మన ప్రజావాణి పత్రికతో పాటు కొన్ని పత్రికలు ఘోషించటంతో వార్తా కథనాలు అందించడంతో ప్రస్తుతం ట్రిప్పుకు 500 నుండి 800 రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. చెల్లించేది ఒక్క కూపన్ కి కానీ ఆ దృవపత్రాన్ని జిరాక్స్ తీసి మాన్యువల్ గా సర్టిఫై చేసి ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నట్లు పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్న నేపథ్యం. ప్రభుత్వ నిబంధన ల ప్రకారం వ్యవహరించాల్సిన సంబంధిత అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దండిగా దండుకుంటున్నట్లు విమర్శలు జోరుగా ఉన్నాయి. ఈ అక్రమ వ్యవహారంపై పత్రికలతో పాటు పలువురు బహిరంగంగా ఆరోపిస్తూ ఉన్నప్పటికీ సంబంధిత శాఖలఅధికారులలో చలనం లేకపోవడం సంచలనం కలిగిస్తోంది. మూడు సంవత్సరాల క్రితం చింతకాని మండలానికి జిల్లా కలెక్టరేట్ నుండి వచ్చిన ఓ రెవెన్యూ అధికారి డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తూ అన్ని తానై ఏకచత్రాధిపతిగా ఆ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తూ తనిఖీలు మరిచి నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొందరు మండల తహసిల్దార్ కు ఇన్చార్జి అధికారిని యధావిధిగా విధులకు వచ్చేందుకు సాయంత్రం వరకు చర్చలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన సంబంధిత రెవెన్యూ అధికారులు ప్రాథమిక సూత్రాలను విస్మరించి అడ్డగోలుగా వ్యవహరించడం వెనుక పలు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా ఓ తాహసిల్దార్ ఆరోగ్య సమస్యలతో సెలవు పెట్టడంతో చింతకాని మండలానికి డిప్యూటేషన్ పై వచ్చిన సదరు మండల రెవెన్యూ అధికారిని క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడం పట్ల పలు విమర్శలు ఆరోపణలు ఉన్నాయి. ఓసీపీలు లాగిన్లు ఇతర రికార్డులను స్పష్టంగా లేకపోయినప్పటికీ ఆ మండలంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాకు జిల్లా కేంద్రంలోని కొందరు సహకారం అందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. కాగా ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలో చింతకాని మండలంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై పలు ప్రజా సంఘాలు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యం. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించకుండా వ్యవహరించడం కలకలం లేపుతోందని సమాచారం. అయినప్పటికీ కొందరు రంగ ప్రవేశం చేసి ఫైనాన్సులో ట్రాక్టర్లు తీసుకున్నాం మా ఇష్టం అవును రాయటానికి మీరు ఎవరు ప్రశ్నించడానికి మీరు ఎవరు అంటూ గరం గరం వెనుక పలువురు క్షేత్రస్థాయి అధికారులతో పాటు మండల స్థాయి అధికారులు ఉన్నట్లు గుసగుసలు విమర్శలు జోరుగా ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ మైనింగ్ ట్రాన్స్పోర్ట్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ యంత్రాంగాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.