prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 5:56 pm Digital Edition : PRAJA VANI

నెల్లికుదురు మండల కుమ్మర సంఘం మండల కమిటీ ఎన్నిక

నెల్లికుదురు మండల కుమ్మర సంఘం మండల కమిటీ ఎన్నిక

ప్రజావాణి,నెల్లికుదురు:తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నెల్లికుదురు మండల హడాక్ కమిటీని మండల మండల కేంద్రం నెల్లికుదురులోని పూర్వ శాంతినికేతన్ స్కూల్లో మంగళవారం ఎన్నుకున్నారు.జిల్లా గౌరవ అధ్యక్షులు అలవాలా శ్రీనివాస్, జిల్లా అడ్ హక్ కమిటీ కన్వీనర్ అలవాలా ఉపేందర్,కో కన్వీనర్ సముద్రల సోమయ్య, కొత్తపల్లి రమేష్ ల సమక్షంలో ఎన్నుకున్నారు. మండల అడ్ హక్ కమిటి కన్వీనర్ గా రుద్రరాపు రవికుమార్, ప్రధాన కార్యదర్శి గా పోతుగంటి శ్రీనివాస్ లను ఎంపిక చేశారు. కమిటీ సభ్యులు గా పోతుగంటి రవి, వాడ్కాపురం నర్సయ్య, మల్యాల ఐలయ్య, రుద్రరాపు ఉప్పలయ్య, పాలాభిందేలా మహేష్ ల ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రుద్రారపు రవికుమార్ మాట్లాడుతూ అందరి సహకారంతో కుమ్మర సామాజిక వర్గ హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.తమ ఎంపికకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మల్యాల నర్సయ్య, సముద్రల వెంకన్న,బొడ్డుపెల్లి వెంకన్న, అలవాల శ్రీశైలం, కుమ్మర కులస్తులు పాల్గొన్నారు.