తెలంగాణ సంస్కృతి, యాదవుల ఐక్యతకు సదర ఉత్సవాలు ప్రతీక
మేడ్చల్, నవంబర్ 10: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, యాదవ సోదరుల ఐక్యతకు సదర ఉత్సవాలు నిలువెత్తు ప్రతీక అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్న గారి రాఘవేంద్ర గౌడ్ అన్నారు. మేడ్చల్ పట్టణ కేంద్రంలో టీం తల్వార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర సమ్మేళన ఉత్సవాల్లో రాఘవేంద్ర గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవ సోదరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన దున్నపోతుల విన్యాసాలను ఆయన తిలకించారు. అనంతరం యాదవ సోదరులకు, నియోజకవర్గ ప్రజలకు సదర...