prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 5:55 pm Digital Edition : MAHESH MEDCHAL

తెలంగాణ సంస్కృతి, యాదవుల ఐక్యతకు సదర ఉత్సవాలు ప్రతీక

మేడ్చల్, నవంబర్ 10: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, యాదవ సోదరుల ఐక్యతకు సదర ఉత్సవాలు నిలువెత్తు ప్రతీక అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్న గారి రాఘవేంద్ర గౌడ్ అన్నారు. మేడ్చల్ పట్టణ కేంద్రంలో టీం తల్వార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర సమ్మేళన ఉత్సవాల్లో రాఘవేంద్ర గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవ సోదరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన దున్నపోతుల విన్యాసాలను ఆయన తిలకించారు. అనంతరం యాదవ సోదరులకు, నియోజకవర్గ ప్రజలకు సదర పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రుడి గర్వాన్ని అణచివేసి, గోవర్ధన గిరిని ఎత్తి గోవులను, యాదవులను రక్షించిన రోజుకు గుర్తుగా సదర పండుగను జరుపుకోవడం మన సాంప్రదాయమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే ఇటువంటి పండుగలకు మరింత ఆదరణ పెరిగిందన్నారు. మేడ్చల్ పట్టణంలో యాదవ సోదరులందరూ ఎంతో ఉత్సాహంగా, ఐక్యతతో ఈ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ వెనుకబడిన వర్గాల, ముఖ్యంగా గొల్ల, కురుమ, యాదవ సోదరుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాఘవేంద్ర గౌడ్ పేర్కొన్నారు. సమాజంలో యాదవుల ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఉత్సవాల ద్వారా ప్రజలందరి మధ్య సోదరభావం మరింత పెంపొందాలని, శ్రీకృష్ణుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడవెళ్లి మాజీ సర్పంచ్, గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గరిసెల సురేందర్ ముదిరాజ్, మేడ్చల్ మాజీ కౌన్సిలర్లు పెంజర్ల స్వామి యాదవ్, కౌడే మహేష్ కురుమ, బత్తుల శివకుమార్ యాదవ్, మాజీ డైరెక్టర్లు ఒగ్గు శంకర్ కురుమ, గౌర్ల ఎర్ర బీరప్ప కురుమ, మాజీ వార్డు సభ్యులు కౌడే నాగేందర్ కురుమ పాల్గొన్నారు. అలాగే మేడ్చల్ పట్టణ యాదవ, కురుమ సంఘం నాయకులు బత్తుల మధుకర్ యాదవ్, కౌడే భిక్షపతి, గౌర్ల మధు, ఒగ్గు సురేష్, కౌడే శ్రీశైలం, శ్రీరంగవరం నర్సింహ్మ, మైల జీతయ్య, పెంజర్ల భాస్కర్, ఒగ్గు వినోద్, కౌడే శ్రీనివాస్, పెంజర్ల వెంకటేష్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో యాదవ సోదరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.