prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 5:59 pm Digital Edition : PRAJA VANI

జర్నలిస్టుల ఐక్యతకు నూతన అధ్యాయం.. హసన్‌పర్తి మీడియా పాయింట్ అధ్యక్షుడిగా జక్కుల విజయ్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక!

జర్నలిస్టుల ఐక్యతకు నూతన అధ్యాయం.. హసన్‌పర్తి మీడియా పాయింట్ అధ్యక్షుడిగా జక్కుల విజయ్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక!

నూతన కార్యవర్గం ఎన్నికతో జర్నలిస్టుల్లో నూతనోత్సాహం.. హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ముందడుగు

హసన్‌పర్తి, నవంబర్ 10 (మన ప్రజావాణి):

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల మీడియా పాయింట్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎర్రగట్టుగుట్టలోని కళ్యాణ మండపంలో మండల జర్నలిస్టులు సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా జక్కుల విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా సందెల సాగర్ ఎన్నికయ్యారు.

నూతన కార్యవర్గం వివరాలు:

అధ్యక్షుడు: జక్కుల విజయ్ కుమార్
ప్రధాన కార్యదర్శి: సందెల సాగర్
ఉపాధ్యక్షులు: కొప్పుల రాజేందర్, దాడి బిక్షపతి, సందెల రాజు
కోశాధికారి: దాడి చిరంజీవి
సహాయ కోశాధికారి: మండ రాజేష్
కార్యదర్శులు: బొక్క రాజు, వాజిద్
సహాయ కార్యదర్శులు: రామంచ మధుకర్, చెన్నూరి శ్రీనివాస్
సలహాదారులు: సయ్యద్ అహ్మద్, దండుగూడెం రాజకుమార్.

కార్యవర్గ సభ్యులుగా రేణికుంట్ల దుర్గాప్రసాద్, రాజారపు భిక్షపతి, ఎర్ర కుమారస్వామి, పెసరు సూర్యప్రకాష్, చెంగేల్లి నరేష్ చారిని ఎన్నుకున్నారు.

జర్నలిస్టుల సంక్షేమమే నా ప్రధాన లక్ష్యం: జక్కుల విజయ్ కుమార్

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యతకు పెద్దపీట వేస్తానని, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరినీ కలుపుకొని ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మీడియా పాయింట్ సభ్యులు కే. కార్తీక్, బండారి సుమన్, పత్తిపాక విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.