ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి :- ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతిపత్రం

మేడ్చల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్ల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ యూనియన్ నాయకులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ యూనియన్ నాయకుడు నరేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాలుగా ప్రజలకు కీలకమైన వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. గర్భిణులకు వైద్య సేవలు అందించడం, తల్లి–బిడ్డల ఆరోగ్య సంరక్షణ,...