నిరుపేదల సొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇళ్లలో మహేష్ గౌడ్‌తో దీపావళి సంబరాలు!

ఘట్‌కేసర్, నవంబర్ 8: దీపావళి పండుగను పురస్కరించుకుని ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్‌కు చెందిన ఘనపురం, ఫకీర్ టేక్య తండా, లింగాపురం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తమ నూతన గృహాల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. ఈ...