prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 7:47 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

నిరుపేదల సొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇళ్లలో మహేష్ గౌడ్‌తో దీపావళి సంబరాలు!

ఘట్‌కేసర్, నవంబర్ 8: దీపావళి పండుగను పురస్కరించుకుని ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్‌కు చెందిన ఘనపురం, ఫకీర్ టేక్య తండా, లింగాపురం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తమ నూతన గృహాల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా సొంతింటి కోసం ఎదురుచూస్తూ ఎన్నో కష్టాలు అనుభవించిన నిరుపేద కుటుంబాల కల సాకారమైన తరుణంలో వారితో కలిసి దీపావళి జరుపుకోవడం తన జీవితంలో మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుందని అన్నారు. చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే దీపావళి పండుగ రోజున పేద కుటుంబాల జీవితాల్లో సొంతింటి వెలుగులు నిండటం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. నూతన గృహాల్లో లబ్ధిదారుల ముఖాల్లో కనిపించిన చిరునవ్వులు, ఆడబిడ్డల ఆత్మీయత, ఆనందభాష్పాలు తనను ఎంతగానో కదిలించాయని, ఈ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేనని పేర్కొన్నారు.

ఘనపురం గ్రామంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మహేష్ గౌడ్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో ఘనపురం మాజీ సర్పంచులు నానావత్ రూప్ సింగ్ నాయక్, వేముల మమత గౌడ్, మాజీ ఉపసర్పంచ్ వేముల పరమేష్ గౌడ్, 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల శంకర్ గౌడ్, డివిజన్ కార్యదర్శి తాటికొండ మల్లేష్ గౌడ్, ఘనపురం గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వేముల రాజు గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుర్జకుంట నర్సింహా, బర్ల అనిత, 7వ డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పైళ్ల లతారెడ్డి, మాజీ వార్డు సభ్యుడు నానావత్ సురేష్ నాయక్, 7వ డివిజన్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధీరావత్ అనిల్ నాయక్, నాయకులు వేముల గోవర్ధన్ గౌడ్, పైళ్ల జంగారెడ్డి, కట్కూరి భాను గౌడ్, వేముల వెంకట్ గౌడ్, గడ్డం శ్రీనివాస్, బర్ల రమేష్, యువ నాయకుడు వేముల మణిశరణ్ గౌడ్‌తో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.