కాశీనాయన మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఘన విజయోత్సవం: ఘన స్వాగతం పలికిన ప్రజలు
కాశీనాయన (కడప జిల్లా),నవంబర్ 08 ప్రజావాణి కాశీనాయన: ఇటీవల జరిగిన ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘన విజయం సాధించిన కాశినాయన మండల ఎంపీపీ కర్నాటి వెంకటరెడ్డి,జెడ్పీటీసీ సభ్యురాలు ఆర్ల ఓబులమ్మ,ఆమె కుమారుడు ఆర్ల చంద్రయాదవ్లకు మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు.విజయానంతరం తొలిసారి మండలంలో పర్యటించిన వీరికి మిద్దెల,గంగనపల్లి,చిన్నాయపల్లి గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.మంగళ వాయిద్యాలు,డప్పు చప్పుళ్లు,బాణసంచా పేలుళ్లతో వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.గెలిచిన ప్రజాప్రతినిధులను పూలమాలలు,శాలువాలతో...