సంగారెడ్డి పట్టణ అభివృద్ధే లక్ష్యం
సంగారెడ్డి మన సమగ్ర ప్రజావాణి (నవంబర్:07)
సంగారెడ్డి పట్టణంలోని మౌలిక సదుపాయాలకు పెద్దపీట
9వ వార్డు సప్తగిరి కాలనీలో రూ.45 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను, అదేవిధంగా 35వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలోని ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు. నాణ్యతతో కూడిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు శ్రీలత శ్రీశైలం, నర్సమ్మ ప్రసాద్ ,సంగీత మహేష్ సతీష్ రెడ్డి ,వంశీ, శైలేష్ రెడ్డి,రవి నాయక్, కాంగ్రెస్ నాయకులు సురేష్, కిరణ్ రమేష్ వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు