prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 8:05 pm Digital Edition : PRAJA VANI

వెలుగుల పండుగకు భద్రతే తొలిమెట్టు..

*వెలుగుల పండుగకు భద్రతే తొలిమెట్టు…*

*ఆనందాల వేళ సురక్షిత దీపావళి జరుపుకుందాం.*

*భువనగిరి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 07*

చీకట్లను పారద్రోలుతూ వెలుగులను నింపే దీపావళి పండుగను ప్రజలంతా సురక్షిత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు భువనగిరి పట్టణ ప్రజలకు సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి వేడుకలను ఉత్సాహంలో జరుపుకోవాలని చిన్న పాటి నిర్లక్ష్యం వహిస్తే సంబరం కాస్తా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. టపాసులు కాల్చే సమయంలో సింథటిక్ , నైలాన్ దుస్తులకు దూరంగా ఉండి , ఒంటికి సరిపడే కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలని సూచించారు.

*బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా కాలుదాం…*

ఇళ్లు , విద్యుత్ వైర్లు , వాహనాలు లేని విశాల మైన బహిరంగ ప్రదేశాల్లోనే బాణసంచా కాల్చాలనీ సూచించారు.
చిన్నపిల్లలను ఒంటరిగా టపాసులు కాల్చనివ్వ కుండా పెద్దలు పక్కనే ఉండి పర్యవేక్షించాలనీ అన్నారు. చిన్నపాటిగా కాలిన గాయాలైతే సబ్బు లేదా ఐస్ వాడ కుండా 15-20 నిమిషాల పాటు చల్లటి నీటి కింద గాయాన్ని ఉంచాలని సూచించారు. అత్యధికం గా బాణసంచా కాల్చడం వల్ల దట్టమైన పొగతో శ్వాస కోశ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్స్ లు అందు బాటులో ఉన్నాయని అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలు వినియోగించుకోవాలని భువనగిరి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు పట్టణ ప్రజలకు సూచించారు.