prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 6:02 pm Digital Edition : PRAJA VANI

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి

మద్దూరు నవంబర్ 7, ప్రజా వాణి,

మండలంలోని జాలపల్లి,దూలిమిట్ట,కొండాపూర్, హనుమతండ, బైరాన్ పల్లి, గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను చేర్యాల మార్కెట్ కమిటి చైర్మెన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ బోయిని శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దూరప్రాంతాలకు వెళ్లి ధాన్యం విక్రయించకుండా ప్రభుత్వం మనకు అందుబాటులోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మద్దతు ధర పొందాలని ఆర్దికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మెన్ నాగిళ్ల తిరుపతి రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటి డైరెక్టర్లు,నాయకులు, ప్యాక్స్ సి ఈ ఓ బోయిని శ్రీదర్, తదితరులు పాల్గొన్నారు.