మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో సెయింట్ క్లారెట్ హైస్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరం
మేడ్చల్ (ప్రజావాణి):- మెడిసిటీ హాస్పిటల్, మేడ్చల్ ఆధ్వర్యంలో శనివారం మేడ్చల్లోని సెయింట్ క్లారెట్ హైస్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ జోషాప్ శాందప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విశేషంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య బృందం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బీపీ, షుగర్ పరీక్షలతో పాటు కంటి పరీక్షలు నిర్వహించారు. అలాగే చెవి, ముక్కు, గొంతు సంబంధిత సమస్యలు, థైరాయిడ్ గడ్డలు, చర్మ సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించారు. చిన్నారులకు పిల్లల వైద్య...