prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 6:16 pm Digital Edition : RRAJUREGONDA REGONDA

మహిళా సమాఖ్య భవనానికి స్థలం విరాళం – మహిళల చేత సత్కారం

*తల్లిదండ్రుల పేరుతో మూడు  గుంటల భూమి*

 

* రేగొండ మండలం రిపోర్టర్ నవంబర్ 07 (మన ప్రజావాణి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగ్రామస్థాయిలో మహిళా సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తిరుమలగిరి సర్పంచ్ చల్లగురుగుల సుదర్శన్ పేర్కొన్నారు.

 

తిరుమలగిరి గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి స్వర్గస్తులైన తన తల్లిదండ్రులు చల్లగురుగుల శాంతమ్మ – వెంకటనర్సు జ్ఞాపకార్థంగా మూడు గుంటల భూమిని విరాళంగా అందజేశారు.

 

ఈ సందర్భంగా సర్పంచ్ సుదర్శన్ మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పాన్ని గ్రామస్థాయిలో మహిళలకు చేరువయ్యే విధంగా పనిచేస్తానని పేర్కొన్నారు.ఎమ్మెల్యే సత్యనారాయణ రావు సహకారంతో గ్రామ అభివృద్ధికి బాటలు వేస్తానని పేర్కొన్నారు.

మహిళా సమైక్య సభ్యులు భవన నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా అందజేసినందుకు సర్పంచ్ సుదర్శన్ కు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆకుతోట తిరుపతి, బుగులోని జాతర మాజీ చైర్మన్ రొంటాల వెంకటస్వామి, గ్రామ కమిటీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్, దేశిని సాంబయ్య, సీసీ విజయలక్ష్మి, సీఏ సురేష్, లక్ష్మి, అనిత, కొడారి సమత, పాలడగుల రజిత తదితరులు పాల్గొన్నారు.