నా భూమి నాకు ఇప్పించి న్యాయం చేయండి
-బాధిత రైతు నర్సింహా చారి వేడుకోలు
మద్దూరు నవంబర్7, ప్రజా వాణి,
మండలంలోని జాలపల్లి గ్రామంలో తన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని కబ్జా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకొని తన భూమి తనకు ఇప్పించాలని కోరుతూ బాధిత రైతు వలబోజు నరసింహ చారి శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని జాలపల్లి గ్రామ శివారులో గల 1-06 ఎకరం ఆరు గుంటల వ్యవసాయ భూమిని చేరుపల్లి ధర్మారెడ్డి అనే రియాల్టర్ నన్ను నమ్మబలికి ఆక్రమించుకోవాలని చూస్తూ దౌర్జన్యంగా కడీలు నాటి నన్ను నా కుటుంబాన్ని భయాందోళనకు గురి చేస్తూ భూమిలోకి ప్రవేశించకూడదని బెదిరింపులకు పాల్పడుతూ తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నాడంటూ బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి వారసత్వంగా వస్తున్న తన వాటకు వచ్చే పట్టా భూమిని తన ప్రమేయం లేకుండా అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు.ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.