prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 5:39 pm Digital Edition : PRAJA VANI

ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి జరుపుకోవాలంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కొందుర్గ్ మాజీ జెడ్పీటీసీ రామకృష్ణ గారి సూటి ప్రశ్న

*ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి జరుపుకోవాలంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కొందుర్గ్ మాజీ జెడ్పీటీసీ రామకృష్ణ గారి సూటి ప్రశ్న*

కొందుర్గ్ నవంబర్ 07(మన ప్రజా వాని )

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన బిల్లులు పూర్తిస్థాయిలో అందాయా? ఇళ్లు నిర్మించుకోవడానికి అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారుల పరిస్థితి ప్రభుత్వానికి కనిపించడం లేదా?

ఒకవైపు ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి జరుపుకోవాలని ప్రచారం చేస్తున్నారు… మరోవైపు ఇళ్ల నిర్మాణాల కోసం అప్పులపాలైన పేద కుటుంబాలు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నాయి.

ముందు లబ్ధిదారుల పెండింగ్ బిల్లులు పూర్తిగా చెల్లించండి… పేదల అప్పుల బాధలు తీర్చండి… ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాల గురించి మాట్లాడండి

పేదల ఇళ్లలో నిజమైన వెలుగులు నిండినప్పుడే అసలైన దీపావళి