**అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్యలకు బిల్లా యాదగిరి బృందం ఘన స్వాగతం!**
హనుమకొండ జిల్లా, నవంబర్ 07:
అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ కడియం శ్రీహరి గారిని, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు గౌరవ శ్రీమతి కడియం కావ్య గారిని హనుమకొండ జిల్లా వేలేరు మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి ఆధ్వర్యంలో సర్పంచులు బత్తుల శ్రీనివాస్, మాలోతు రాజు, మాలోతు అరుణ నాగరాజు, వేలేరు మండల యూత్ కాంగ్రెస్ నాయకులు వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి, అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి చేరుకున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్యలకు అభినందనలు తెలుపుతూ, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని, హనుమకొండ జిల్లా, వరంగల్ ప్రాంత అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.