గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు
గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు పంచాయతీలకు అదనపు ఆదాయం.. గ్రామీణ ప్రాంతాలకు ఎలక్ట్రిక్ వాహనాల సౌకర్యం కూసుమంచి నవంబర్ 3 (మన ప్రజావాణి) ప్రతినిధి RK : దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. న్యూఢిల్లీలో శనివారం ఈ ఒప్పందం జరిగింది. ఈ పథకంలో భాగంగా గ్రామ పంచాయతీల పరిధిలో...