ఎల్నినో ప్రభావం – వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అవగాహన సమావేశం
ఎల్నినో ప్రభావం – వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అవగాహన సమావేశం స్థలం: రైతు వేదిక, బీర్కూర్ మండలం: బీర్కూర్, జిల్లా: కామారెడ్డి ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం లోటు మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, గ్రామాల్లో రైతులు తీసుకోవాల్సిన అత్యవసర ముందస్తు చర్యలు, పంటల మార్పిడి మరియు ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలపై అవగాహన కల్పించేందుకు బీర్కూర్ రైతు వేదికలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ పెద్దలు మరియు...