సాహసానికి సెల్యూట్ ధైర్యానికి జోహార్లు

సాహసానికి సెల్యూట్ ధైర్యానికి జోహార్లు లక్ష్మి… నీ ధైర్యం వేలాది మంది బాలికలకు స్ఫూర్తి! ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 1 రాప్తాడు, అనంతపురం జిల్లా ఒకవైపు రంపం మిషన్ చేతబట్టి తోటి విద్యార్థినిపై దాడికి తెగబడిన వ్యక్తి… మరోవైపు ప్రమాదం పొంచి ఉందని తెలిసినా, తోటి విద్యార్థినిని రక్షించేందుకు ముందుకొచ్చిన చిన్నారి లక్ష్మి! దాడి జరిగిన తర్వాత ఉక్కుపాదంతో అణిచివేస్తాం, తాట తీస్తాం అంటూ ప్రకటనలు చేసే నాయకులు చాలామంది ఉంటారు. కానీ ప్రమాదం కళ్లముందు ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి ఎదురు నిలబడే...