prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 9:40 pm Digital Edition : PRAJA VANI

పారదర్శకతకు కొత్త అడుగు

పారదర్శకతకు కొత్త అడుగు

కాంగ్రెస్ పార్టీ కురవి మండల అధ్యక్షులు బాలగని శ్రీనివాస్ గౌడ్
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 2 ప్రజావాణి :
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత పెరిగేట్టే కాకుండా, లబ్ధిదారులకు సౌలభ్యం కలుగుతుందనిఈ కార్డులు క్యూఆర్ కోడ్, భద్రతా ఫీచర్లతో రూపొందించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ కురవి మండల అధ్యక్షులు బాలగని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
కురవి మండలంలోని జగ్యా తండా గ్రామపంచాయతీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు అందించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాము నాయక్, కురవి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సుంచు శేఖర్, మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు శరత్, మండల నాయకులు డాక్టర్ కరుణాకర్ పాల్గొన్నారు.
అలాగే జగ్యా తండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రు నాయక్, ఆలయ ధర్మకర్త శక్రు నాయక్, బాలు నాయక్, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు