prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 9:13 am Digital Edition : PRAJA VANI

సుమారు 20 దుకాణాల అనుమతులు భద్రతా ప్రమాణాల పరిశీలన

సుమారు 20 దుకాణాల అనుమతులు భద్రతా ప్రమాణాల పరిశీలన

* అనుమతులు లేకుండానే టపాసుల నిల్వలు వచ్చాయా

* సుమారు 20 దుకాణాల అనుమతులు భద్రతా ప్రమాణాల పరిశీలన

* పన్నుల చెల్లింపులు వినియోగదారులకు బిల్లుల మోత

* అధికారులపై వస్తున్న మామూళ్ల ఆరోపణలపై ఉన్నతస్థాయి విచారణ

* జమ్మికుంటలో టపాసుల దందాకు తెర వెనుక మామూళ్ల పర్వం

* నిబంధనలు గాలికి పన్నుల ఎగవేతకు ఆస్కారం అధికారుల పర్యవేక్షణ ఏదీ

* సుమారు 20 టపాసుల దుకాణాల ఏర్పాటుకు సన్నాహాలు

* వ్యాపారుల సిండికేట్‌తో వినియోగదారులపై ధరల భారం

జమ్మికుంట అక్టోబర్ 31 (ప్రజావాణి)

జమ్మికుంటమున్సిపల్.పరిధిలోనిదీపావళి పండుగ వచ్చిందంటే చాలుటపాసుల వ్యాపారులకు కాసుల వర్షం కురిసే సమయం ఆసన్నమవుతుంది. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు నిబంధనలను పక్కనపెట్టి భారీ ఎత్తున వ్యాపారాలు సాగించేందుకు సిద్ధమవుతున్నారనే ఆరోపణలు జమ్మికుంట పట్టణంలో వినిపిస్తున్నాయి. టపాసుల విక్రయాల పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయంలో పారదర్శకత ఎంతవరకు ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయిజమ్మికుంట పట్టణంలో ఈ ఏడాది సుమారు 20 టపాసుల దుకాణాల ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో దుకాణాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే టపాసుల విక్రయాలకు అవసరమైన అనుమతులు అగ్నిమాపక భద్రతా చర్యలు ఇతర ప్రభుత్వ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలవుతున్నాయాలేదా అన్నది అధికారుల పరిశీలనలో తేలాల్సి ఉందిమామూళ్ల ఆరోపణలుఅధికారుల పాత్రపై అనుమానాలుటపాసుల దుకాణాలకు అనుమతుల ప్రక్రియలో సంబంధిత శాఖల అధికారుల పాత్రపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ వాణిజ్య పన్నులు, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖల పరిధిలో నిబంధనల అమలు ఎలా జరుగుతోందనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అనుమతుల కోసం వ్యాపారులు అధికారులను సంప్రదించే క్రమంలో మామూళ్లు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవాలేమిటో ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వెల్లడించాల్సిన అవసరం ఉందిబిల్లులు ఇవ్వకుండానే విక్రయాలా పన్నుల లెక్కలేవీటపాసుల విక్రయాల సమయంలో వినియోగదారులకు తప్పనిసరిగా బిల్లులు ఇస్తున్నారావ్యాపార లావాదేవీలకు సంబంధించిన పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నారాఅనే అంశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయికిలోల లెక్కన భారీ మొత్తంలో టపాసులు విక్రయిస్తున్నప్పటికీ ప్రతి విక్రయానికి రసీదులు ఇవ్వకపోతే ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలనికోరుతున్నారుసిండికేట్‌గా మారి ధరల మోతమరోవైపు టపాసుల వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తమ ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్యాకెట్లపై ముద్రించిన ధరలకు, విక్రయ సమయంలో వసూలు చేస్తున్న ధరలకు మధ్య వ్యత్యాసం ఉంటోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పండుగను దృష్టిలో పెట్టుకొని అధిక ధరలకు విక్రయాలు సాగిస్తే సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళనవ్యక్తంచేస్తున్నారుఅనుమతులు లేకుండానే టపాసుల నిల్వలు వచ్చాయాజమ్మికుంట పట్టణంలోని కొన్ని హోల్‌సేల్ దుకాణాల్లో ఇప్పటికే టపాసుల విక్రయాలు ప్రారంభమైనట్లు సమాచారం అనుమతులు పొందకముందే భారీ మొత్తంలో టపాసుల నిల్వలు పట్టణానికి చేరాయా వాటిని ఎక్కడ నిల్వ చేస్తున్నారు గోదాముల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశాలపై అధికారులు దృష్టి సారించాల్సి ఉందిజిల్లా అధికారులు స్పందించాలిదీపావళి పండుగ సందర్భంగా ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు, ప్రతి దుకాణానికి చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు లేకుండా టపాసుల విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు, పన్నుల ఎగవేత అధిక ధరల వసూళ్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారుముఖ్యంగా గతంలో జరిగిన విక్రయాలు, పన్నుల చెల్లింపులు, అనుమతుల జారీ ప్రక్రియపై కూడా విచారణ చేపడితేనే అసలు వ్యవహారం వెలుగులోకి వస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారుపండుగ పేరుతో వ్యాపారులు లాభాలు గడించడం ఒక ఎత్తయితే, ప్రజల భద్రతను పణంగా పెట్టి నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు