బాల్య వివాహాల నిరోధక చట్టం పై అవగాహన సదస్సు
* అంగన్వాడి టీచర్లకు బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 గురించి అవగాహన సదస్సు
జమ్మికుంట అక్టోబర్ 31 (ప్రజావాణి)
జమ్మికుంట కృషి విజ్ఞన కేంద్రం లో శనివారం జమ్మికుంట వావిలాల సెక్టర్ మీటింగ్ లొ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(ఎస్ ఆర్ డి) ఆధ్వర్యంలో జమ్మికుంట సెక్టార్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ జమ్మికుంట మండలం లోని అంగన్వాడి టీచర్లకు బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 గురించి అవగాహన సదస్సు నిర్వహించారుఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జమ్మికుంట వావిలాల రమాదేవి పద్మ మాట్లాడుతూ బాల్య వివాహం చేయటంవల్ల కలిగే నష్టాల గురించి వివరించడం జరిగిందిఅలాగే సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కరీంనగర్ గాజంగి వీరాస్వామి వీరన్న కమ్యూనిటీ సోషల్ ఆర్గనైజర్ మాట్లాడుతూ బాల్య వివాహమంటే 18 సంవత్సరాలు నిండకుండా ఉన్న అమ్మాయి 21 సంవత్సరాలు నిండకుండా ఉండే అబ్బాయి పెళ్లి చేసుకోవడం నేరం దీనికి లక్ష రూపాయల జరిమానారెండు సంవత్సరాల జైలు శిక్ష విధించబడును బాల్య వివాహానికి సహకరించిన వారికి మద్దతిచ్చిన వారందరూ శిక్షార్హులు అని చెప్పారు.బాల్య వివాహం వల్ల బాల బాలికలకు అనారోగ్య సమస్యలు రావచ్చు కావున బాల్య వివాహం చేయడం నేరం అని తెలిపారుఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవిపద్మ ఎస్ ఆర్ డి ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్ ఆర్గనైజర్ గాజంగి. వీరాస్వామి వీరన్న అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు