పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ నాయకుల విస్తృత ప్రచారం
31వ వార్డులో నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తిప్పన విజయసింహారెడ్డి నవంబర్ 1 (ప్రజావాణి): వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా కోదాడ పట్టణంలోని 31వ వార్డులో ఆదివారం ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్త, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఆదేశాల మేరకు, కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు షేక్ నయీమ్ ఆధ్వర్యంలో, 31వ వార్డు ఇన్చార్జి చలిగంటి వెంకట్ నేతృత్వంలో ఈ కార్యక్రమం...