చదువులో వెనుకబడిన విద్యార్థులకు వీకెండ్ తరగతులు
ఘట్కేసర్, అక్టోబర్ 31 (ప్రజా వాణి): విద్యాపరంగా వెనుకబడిన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘట్కేసర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం వీకెండ్ తరగతులు నిర్వహించారు. సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల జాతీయ సేవా పథకం విద్యార్థుల సహకారంతో నిర్వహించిన ఈ తరగతుల్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తెలుగు, ఆంగ్ల భాషల్లో చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని గుర్తించి, వారికి సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించారు. ప్రభుత్వ...