prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 9:19 am Digital Edition : PRAJA VANI

ఘనంగా అలయ్ బలయ్ కార్యక్రమం

ఘనంగా అలయ్ బలయ్ కార్యక్రమం.

కార్యకర్తలు నా బలగం

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..

రాయపోల్, అక్టోబర్ 31(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లారాయపోల్ మండల కేంద్రంలోని జీఎల్ఆర్ ఫంక్షన్ హాల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు..

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులు, నాయకులతో ఆత్మీయంగా మమేకమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..

ప్రజల ఆశీస్సులు కార్యకర్తల అండదండలతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకురావాలని సూచించారు ప్రతి పది పదిహేను రోజులకు ఒకసారి నాయకులకు కార్యకర్తలతో సమావేశమై గ్రామాల్లోని సమస్యలు పార్టీ పరిస్థితులపై చర్చిస్తామని హామీ ఇచ్చారు కార్యకర్తలకు పోలీస్ స్టేషన్లో ఇతర ప్రభుత్వ కార్యాలయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైన అండగా ఉంటానని భరోసా ఇచ్చారు కొత్తవారికి కూడా పార్టీలో అవకాశాలు కల్పిస్తూ గ్రామ స్థాయిలో కమిటీలు యువజన విద్యార్థి ఎస్సి తదితర విభాగాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాయపోల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రేకుల నరసింహారెడ్డి, మాజీ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, యువజన నాయకులు రాజు రెడ్డి, దయాకర్, మాజీ ఏఎంసి, చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, మాజీ,కో ఆప్షన్ ఫర్విస్ , వివిధ గ్రామాల, సర్పంచులు, బీ ఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు, భారీ ఎత్తున పాల్గొన్నారు.