ఘట్‌కేసర్‌లో ఘనంగా ఏఐటీయూసీ 107వ వార్షికోత్సవం

ఘట్‌కేసర్, అక్టోబర్ 31 (ప్రజావాణి): ఘట్‌కేసర్ ఎంఎంసీ మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ 107వ వార్షికోత్సవాన్ని కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ సువర్ణ ఏఐటీయూసీ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కల్లూరి జయచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కల్లూరి జయచంద్ర మాట్లాడుతూ కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని విమర్శించారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని,...