గురుకులాల్లో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

గురుకులాల్లో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి విద్యార్థి ఫినాయిల్ తాగిన ఘటనపై సబ్‌ కలెక్టర్‌కు తల్లిదండ్రుల సంఘం వినతి నారాయణఖేడ్, అక్టోబర్ 31 (ప్రజావాణి): గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రతి నెల అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సాపూర్ శంకర్, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి రమేష్ కోరారు. నారాయణఖేడ్ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హర్షిత్ గౌడ్ ఫినాయిల్ తాగి ఆస్పత్రిలో చికిత్స పొందిన...