prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 9:09 am Digital Edition : PRAJA VANI

క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమారు దీపక్

*క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమారు దీపక్*

మంచిర్యాల,ప్రజావాణి రిపోర్టర్,అక్టోబర్ 31 :

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ ఆసుపత్రి పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం ఆకస్మికంగా సందర్శించి, పురోగతిని పరిశీలించారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ ఆసుపత్రి పనులను ఆకస్మికంగా సందర్శించి, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే 129.25 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రి, 23.75 కోట్ల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, నిర్మాణ పనుల పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.