prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 9:15 am Digital Edition : PRAJA VANI

కాంగ్రెస్ పార్టీ నుండి బీ ఆర్ఎస్ పార్టీలో చేరికలు

కాంగ్రెస్ పార్టీ నుండి బీ ఆర్ఎస్ పార్టీలో చేరికలు…

రాయపోల్, అక్టోబర్ 31 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లారాయపోల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర యువజన నాయకులు అనుమండ్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. రాయపోల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గొల్ల కృష్ణ యాదవ్.మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి కాంగ్రెస్ లో ఉంటూ పార్టీకి బలోపేతానికి కృషి చేశాను తెలిపారు. గత పదిహేను సంవత్సరాల నుండి పార్టీకి ఎంతో సేవలందిస్తూ పార్టీ అధికారం ఉన్న లేకున్నా పార్టీ కోసం పని చేశానని కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడంలేదని కొత్తవారికి ప్రాధాన్యత ఇవ్వడం బాధాకరంగా ఉందన్నారు.బి ఆర్ ఎస్ పార్టీ సేవలు చూసి పలు అభివృద్ధి పనులు చూసి బీ ఆర్ఎస్ పార్టీలో బలపేతానికి కృషి చేస్తానని అన్నారు.