కంగ్టి ఎంపీడీవో దయాకర్ రావుకు సర్పంచుల ఘన వీడ్కోలు
కంగ్టి ఎంపీడీవో దయాకర్ రావుకు సర్పంచుల ఘన వీడ్కోలు నారాయణఖేడ్ ఆర్సి, అక్టోబర్ 31 (ప్రజావాణి): నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) దయాకర్ రావు పదవీ విరమణ సందర్భంగా మండలంలోని సర్పంచులు ఘనంగా వీడ్కోలు పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పూలమాల వేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ శరణప్ప మాట్లాడుతూ.. ఎంపీడీవో దయాకర్ రావు మండలంలో పనిచేసిన సమయంలో గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అందించిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. ప్రజాప్రతినిధులతో...