ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ విదేశీ విద్యార్థుల వీరంగం

ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ విదేశీ విద్యార్థుల వీరంగం! సిద్ధాపురంలో యువకుడిపై రాళ్లు, కర్రలతో దాడి.. తీవ్రంగా గాయపడిన యువకుడు హసన్‌పర్తి, అక్టోబర్ 31 (మన ప్రజావాణి): హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధాపురం గ్రామంలో ఎస్‌ఆర్‌ యూనివర్సిటీకి చెందిన విదేశీ విద్యార్థులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై శనివారం సాయంత్రం బాధితుల ఫిర్యాదు మేరకు హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన...