prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 1:25 pm Digital Edition : PRAJA VANI

ఎంపీడీవో దయాకర్ రావుకు ఘనంగా వీడ్కోలు

ఎంపీడీవో దయాకర్ రావుకు ఘనంగా వీడ్కోలు

క్రమశిక్షణ, అంకితభావంతో సేవలందించారు. డీఎల్‌పీవో సుధాకర్ రెడ్డి తహసీల్దార్ గంగాభవాని ప్రశంసలు

నారాయణఖేడ్ ఆర్సీ, అక్టోబర్ 31 (ప్రజావాణి):

కంగ్టి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన దయాకర్ రావుకు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల మండల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఆయనకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.అనంతరం
డీఎల్‌పీవో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. విధుల నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధతకు ప్రాధాన్యతనిస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి దయాకర్ రావు విశేషంగా కృషి చేశారని కొనియాడారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, అంకితభావం ఇతర అధికారులకు ఆదర్శమని అన్నారు.ఈ సందర్భంగా తహసీల్దార్ గంగాభవాని మాట్లాడుతూ.. దయాకర్ రావుతో కలిసి పనిచేయడం మంచి అనుభవమని, వివిధ శాఖల మధ్య సమన్వయం పాటిస్తూ మండల పరిపాలనను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు. ఆయనతో ఏర్పడిన అనుబంధం ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. దయాకర్ రావు మాట్లాడుతూ.. కంగ్టి మండలంతో తనకు ఏర్పడిన అనుబంధాన్ని ఎప్పటికీ మరువలేనని భావోద్వేగంగా తెలిపారు. మండలంలో నాలుగు నెలల పాటు పనిచేసిన కాలం ఎంతో సంతృప్తినిచ్చిందని, అభివృద్ధి పనుల అమలులో అధికారులు, సిబ్బంది అందించిన సహకారం మరువలేనని పేర్కొన్నారు.తక్కువ సమయంలోనే మండల ప్రజలు, ప్రజాప్రతినిధులతో ఆత్మీయ అనుబంధం ఏర్పడిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవోలు,ఎంపీఓ లక్ష్మణ్, ఏపీవో బసవరాజ్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రజాప్రతినిధులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.