prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 9:36 am Digital Edition : PRAJA VANI

ఆకాశాన్నంటిన బియ్యం ధరలు.. సామాన్యుడిపై పెనుభారం

*ఆకాశాన్నంటిన బియ్యం ధరలు.. సామాన్యుడిపై పెనుభారం!*
*-జేఎస్ఆర్ 25 కిలోల బియ్యం బస్తా రూ.2,300*

*-కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించాలి:*

*డాక్టర్ దిగ్గే బాబు*

*ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 31: సంగారెడ్డి జిల్లా*

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారుతున్నాయని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ దిగ్గే బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ..నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన బియ్యం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. గతంలో రూ.1,500గా ఉన్న జేఎస్ఆర్ రకం 25 కిలోల బియ్యం బస్తా ధర ప్రస్తుతం రూ.2,300కు చేరిందని, కిలో బియ్యం ధర సుమారు రూ.92కు విక్రయిస్తున్నారని తెలిపారు. ఇంత భారీగా ధరలు పెరగడంతో సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు.
కొంతమంది వ్యాపారులు బియ్యం కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. బియ్యం నిల్వలు, మార్కెట్ ధరలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు, దాడులు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం బియ్యం ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసరమైన బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.