అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
* నాలుగు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని సాగు
* రూ.4 లక్షల పెట్టుబడి అప్పు వర్షాభావంతో ఎండిపోయిన పంటమనోవేదనతో రైతు
జమ్మికుంటఅక్టోబర్ 31 (ప్రజావాణి)
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని పాపక్కపల్లె గ్రామంలోవ్యవసాయాన్ని నమ్ముకొని కౌలుకు భూమి తీసుకొని పత్తి, వరి పంటలు సాగు చేసిన రైతును అప్పుల భారం, పంట నష్టం తీవ్ర మనోవేదనకు గురిచేసిన విషాద ఘటన చోటుచేసుకుందిసాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతో పుట్టకొక్కుల రాజయ్య (62) ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకుఫిర్యాదుచేశారుపోలీసులకు అందిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. పాపక్కపల్లె గ్రామానికి చెందిన పుట్టకొక్కుల రాజయ్య తండ్రి మల్లయ్య సుమారు నాలుగు ఎకరాల 30 గుంటల భూమిని కౌలుకు తీసుకొని పత్తి, వరి పంటలను సాగు చేస్తున్నాడు. వ్యవసాయ పెట్టుబడుల కోసం సుమారు రూ.4 లక్షలు అప్పుగా తీసుకొని పంటల సాగు చేపట్టాడు అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో సాగు చేసిన
పంటలు ఎండిపోయాయి. దీంతో పెట్టిన పెట్టుబడి చేతికి రాకపోగా, చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళన ఆయనను వెంటాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారుఈ క్రమంలో అక్టోబర్ 30వ తేదీ శుక్రవారం సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాజయ్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య పుట్టకొక్కుల రాధా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో
తెలిపారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న
కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పంటలు చేతికందక, పెట్టుబడుల కోసం చేసిన అప్పుల భారం రైతు కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసినట్లు తెలుస్తోంది. భార్య రాధా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.