స్వదేశానికి తిరిగి వచ్చిన ఎమ్మెల్యే, ఎంపీ లకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికిన నర్సింగ రమేష్
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 05 (ప్రజావాణి): ఇటీవల కాలంలో అమెరికా పర్యటనకు వెళ్లిన స్టేషన్ ఘన్‌పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ సభ్యుల కడియం కావ్య లు తమ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరిగి స్వదేశానికి బుధవారం రాత్రి చేరుకున్నారు.
వారి రాక సందర్భంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
ఈ సందర్బంగా లింగాల ఘణపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎన్నికల మండల కో-ఆర్డినేటర్ నర్సింగ రమేష్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య లకి పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ స్వాగత కార్యక్రమంలో డీసీసీ సంయుక్త కార్యదర్శి దామెర నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నెల్లుట్ల గ్రామ శాఖ అధ్యక్షుడు మాచెర్ల మహేందర్ గౌడ్, సీనియర్ నాయకులు జెగ్గం ఆనంద్, ధర్మారెడ్డి, కాటం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నర్సింగ రమేష్ మాట్లాడుతూ, కడియం శ్రీహరి, కడియం కావ్య అమెరికా పర్యటనలో ప్రవాస తెలంగాణ ప్రజలతో కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించడం అభినందనీయమని తెలిపారు. వారి రాకతో నియోజకవర్గంలో మరింత ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే, ఎంపీ కార్యకర్తలతో ఆప్యాయంగా మాట్లాడి, తమ పర్యటన విశేషాలను పంచుకున్నారు.