prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 8:07 am Digital Edition : PRAJA VANI

సైబర్ నేరాల పట్ల ప్రజలుఅప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాల పట్ల ప్రజలుఅప్రమత్తంగా ఉండాలి!

ప్రజలు అపరిచిత లింకులు క్లిక్ చేయొద్దు.. ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు

చిన్నంబావి ఎస్ఐ రామన్ గౌడ్

చిన్నంబావి, నవంబర్ 2 ప్రజావాణి:

సైబర్ నేరాల పట్ల ప్రజలుఅప్రమత్తంగా ఉండాలని చిన్నంబావి ఎస్ఐ రామన్ గౌడ్ సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంఅందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసంచేస్తూఆర్థికంగానష్టపరుస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు.బ్యాంకు అధికారులమని, పోలీసులమని, ఇతర ప్రభుత్వ శాఖలప్రతినిధులమని ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు అడిగేవారిపట్లఅప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు నంబర్లు, పిన్ నంబర్లు, ఓటీపీలు ఎవరికీచెప్పకూడదని స్పష్టం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింకులను క్లిక్ చేయడం,అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్చేసుకోవడం వల్ల వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.ఆన్‌లైన్‌లో అధిక లాభాలు వస్తాయని చెప్పే పెట్టుబడి పథకాలు, తక్కువ ధరకు వస్తువులుఅందిస్తామనే ప్రకటనలు, బహుమతులు వచ్చాయని పంపించేసందేశాలనునమ్మిమోసపోవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులకు పూర్తిగా నమ్మకంఏర్పడకముందే డబ్బులు పంపించవద్దని సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతోబెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసే మోసాల పట్ల కూడాప్రజలుజాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

సైబర్ మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలి

ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి డబ్బులుపోగొట్టుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్ఐ సూచించారు. అలాగే అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చనితెలిపారు. మోసానికి సంబంధించిన ఫోన్ నంబర్లు, సందేశాలు, లావాదేవీలవివరాలు, స్క్రీన్‌షాట్‌లను భద్రపరచుకోవాలని సూచించారు.
ప్రజలుఅప్రమత్తంగా ఉండటం, వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగాఉంచుకోవడం,అనుమానాస్పద లావాదేవీలకు దూరంగా ఉండటం ద్వారా సైబర్ నేరాలనుచాలావరకు నివారించవచ్చని రామన్ గౌడ్ పేర్కొన్నారు. సైబర్ నేరాలపై కుటుంబ సభ్యులకు,ముఖ్యంగా విద్యార్థులకు, వృద్ధులకుఅవగాహన కల్పించాలని కోరారు.